Viveka Murder Case : ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుపై ముగిసిన వాదనలు

వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుపై వాదనలు ముగిశాయి. రేపు హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. సాక్ష్యాలను తారుమారు చేయడం, సాక్షులను ప్రభావితం చేయడంతో పాటు.. విచారణకు సహకరించడం లేదని సీబీఐ తరపు న్యాయవాది వాదించారు. గంగిరెడ్డి సాక్షులను ప్రభావితం చేయలేదని.. అన్ని ఆరోపణలు పరిశీలించాకే ఏపీ హైకోర్టు బెయిల్ ఇచ్చిందని గంగిరెడ్డి తరపు లాయర్ వాదించారు. గతంలో సిట్ గంగిరెడ్డిని నార్కో అనాలసిస్ చేసిందని.. వివరాలు మాత్రం ఇవ్వలేదన్నారు గంగిరెడ్డి తరపు లాయర్. ఇప్పటి వరకు దర్యాప్తు సంస్థల ముందు గంగి రెడ్డి 72 సార్లు హాజరయ్యారని తెలిపారు. కొత్తగా గంగిరెడ్డిని విచారించాల్సింది ఏమి లేదని గంగిరెడ్డి తరపు లాయర్ పేర్కొన్నారు.
వివేక హత్యలో ప్రధాన పాత్ర పోషించింది గంగి రెడ్డేనని… ప్రధాన నిందితుడిగా ఉండి బయట ఉండటంతో.. సాక్షులు ముందుకు వచ్చేందుకు భయపడుతున్నారని సీబీఐ తరపు లాయర్ చెప్పారు. గంగిరెడ్డి బయట ఉండటం అంత మంచిది కాదని.. హత్య చేయడమే కాదు, నేరం కప్పిపుచ్చేందుకు ఆధారాలు కూడా చేరిపేశారన్నారు. ఏపీ హైకోర్ట్ ఇచ్చిన డీఫాల్ట్ బెయిల్ రద్దు చేయాలని కోరారు. అటు.. గంగిరెడ్డి లాంటి నిందితుడు బయట ఉంటే సమాజానికి తప్పుడు సంకేతం వెళ్తుందని.. అత్యంత ప్రభావితం చేసే వ్యక్తి గంగిరెడ్డి అంటూ సునీత తరపు లాయర్ వాదించారు. హత్య చేసిన వ్యక్తి బయట తిరుగుతుంటే బాధితులకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com