Maharashtra: బాలికపై తండ్రి, సోదరుడితో సహా నలుగురు కుటుంబ సభ్యుల లైంగిక వేధింపులు..

Maharashtra: ఒక్కొక్కసారి కొందరు చేసే పనులు చూస్తుంటే.. వారు మనుషులేనా అన్న ప్రశ్న తలెత్తుతుంది. ముఖ్యంగా ఈమధ్య బంధాలు కూడా మరిచిపోయి.. కొందరు మరీ దారుణంగా ప్రవర్తించడం చూస్తూనే ఉన్నాం. అలాంటి మరో దారుణమైన ఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకుంది. తండ్రితో సహా కుటుంబంలోని మగవారంతా ఆఘాయిత్యం చేస్తుంటే ఎవరితో చెప్పుకోవాలో తెలియని వయసు ఆ బాధితురాలిది.
11 ఏళ్ల చిన్నారిపై తాత, మామ లైంగికంగా వేధింపులకు తెగబడ్డారు. ఇది ఇప్పటిది కాదట.. అయిదేళ్లుగా ఈ దారుణం జరుగుతూనే ఉందని బాలిక బయటపెట్టింది. అయితే దీనికంటే ముందు మరో దారుణం జరిగిందని పోలీసులు తెలిపారు. ముందుగా 2017లో బాలిక తండ్రి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
తండ్రి తరువాత సోదరుడి చేతిలో లైంగికంగా వేధింపులకు గురయ్యింది బాధితురాలు. అయితే తండ్రి, సోదరుడు, తాత, మామ కూడా తనను లైంగికంగా వేధించారు. కాకపోతే ఇది గ్యాంగ్ రేప్ కాదని, ఒకరి తర్వాత ఒకరు బాలికపై లైంగికంగా వేధించారని పోలీసులు బయటపెట్టారు. వారందరిపై పోక్సో చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్టు వారు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com