Nellore : నెల్లూరులో 11ఏళ్ల చిన్నారి మృతి.. ముక్కు ఆపరేషన్ వికటించి

వైద్యులపై ఆగ్రహంతో ఆస్పత్రి ఎదుట చరిష్మా బంధువుల ఆందోళన
Nellore : నెల్లూరులో 11 ఏళ్ల చిన్నారి మృతి కలకలం రేపుతోంది. ముక్కు ఆపరేషన్ వికటించే చిన్నారి చరిష్మా మృతి చెందినట్లు కుటుంబసభ్యులు కన్నీమున్నీరు అవుతున్నారు. అనంతసాగరం మండలం ఉప్పలపాడుకు చెందిన చరిష్మా ముక్కుకు శస్త్ర చికిత్స కోసం స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. ఆపరేషన్ అనంతరం చరిష్మా అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. చరిష్మా మృతిపై వైద్యులను నిలదీస్తే... సరైన సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నట్లు బంధువులు ఆరోపించారు. అటు ఆస్పత్రిలో చేరిన సమయంలో చరిష్మా తీసిన సెల్ఫీ వీడియా వైరల్ అవుతోంది. చిన్నారి ఆపరేషన్‌లో లోపం లేదన్న వైద్యులు...ఎలాంటి అనుమానాలున్నా ఇతర వైద్యులతో విచారణ చేయించాలన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com