Vikarabad: వికారాబాద్ జిల్లాలో దారుణం.. 15 ఏళ్ల బాలికను రాయితో తలపై మోది హత్య..

Vikarabad: వికారాబాద్ జిల్లాలో దారుణం.. 15 ఏళ్ల బాలికను రాయితో తలపై మోది హత్య..
X
Vikarabad: వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం అంగడిచిట్టంపల్లిలో దారుణం చోటుచేసుకుంది.

Vikarabad: వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం అంగడిచిట్టంపల్లిలో దారుణం చోటుచేసుకుంది. బహిర్భూమికి వెళ్లిన 15 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. గుర్తుతెలియని యువకుడు... బాలిక తలపై రాయితో మోది పారిపోయాడు. అదే గ్రామానికి చెందిన నాని అనే యువకుడిపై బాలిక తల్లి అనుమానం వ్యక్తంచేసింది. గత కొన్నాళ్లుగా తన కూతురుని ఇబ్బందులు పెడుతున్నట్లు పేర్కొంది. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి పరిశీలించారు. కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తంచేసిన యువకుడి వివరాలతో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags

Next Story