Drugs : వామ్మో..! 2,500 కిలోల డ్రగ్స్ పట్టివేత

సముద్రమార్గం ద్వారా జరుగుతున్న డ్రగ్స్ అక్రమ రవాణాపై భారత నౌకాదళం దృష్టి సారించింది. తాజాగా అనుమానాస్పద నౌకలను తనిఖీ చేస్తుండగా, ఓ నౌకలో 2,500 కిలోల మాదక ద్రవ్యాలను గుర్తించింది. ఆమొత్తాన్ని స్వాధీనం చేసుకున్నది. నావికా దళానికి చెందిన ఫ్రంట్ లైన్ ఫ్రిగేట్ ఐఎన్ ఎస్ తార్కాష్ యుద్ధ నౌక ఈ ఆపరేషన్లో కీలకపాత్ర పోషించింది. మార్చి 31న పశ్చిమ హిందూ మహాసముద్రంలో కొన్ని నౌకల అనుమానాస్పద కదలికలపై నేవీకి సమాచారం అందింది. దాంతో ఐఎన్ఎస్ తార్కాష్ను రంగంలోకి దించారు. పీ81 సముద్ర నిఘా విమానం, ముంబైలోని మారిటైమ్ ఆపరేషన్స్ సెంటర్ సమన్వయంతో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. అనుమానాస్పద నౌక అడ్డగించారు. తార్కాష్ యుద్ధ నౌకలోని హెలి కాప్టర్ ద్వారా మెరైన్ కమాండోలు, స్పెషలిస్ట్ బోర్డింగ్ బృందాలు ఆ షిప్లోకి చేరు కున్నాయి. కార్గో కంపార్ట్మెంట్లను తనిఖీ చేయగా, 2,386 కిలోల హషీష్, 121 కిలోల హెరాయిన్తో సహా 2,500 కిలోల మత్తు పదార్థాలు లభించాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com