Maharashtra: చాక్లెట్ ఆశ చూపించి ఏడేళ్ల బాలుడిపై అత్యాచారం..

Maharashtra: ఈమధ్య కాలంలో మైనర్లపై రేప్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తల్లిదండ్రులు, పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న రోజూ ఇలాంటి వార్తలు చూడక తప్పడం లేదు. కేవలం అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకు కూడా అబ్బాయిల నుండి రక్షణ లేకుండా పోతోంది. దానికి ఇటీవల జరిగిన ఈ ఘటనే ఉదాహరణ.
మహారాష్ట్రలోని పింప్రీ, చించ్వాడ్ ప్రాంతంలో నివసించే అలీమ్ ముసా షేక్ అనే 27 ఏళ్ల యువకుడు.. అదే ప్రాంతంలో ఉండే ఏడేళ్ల బాలుడిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం. బాలుడు గార్డెన్‌లో ఆడుకుంటుండగా.. షేక్ అతడికి చాక్లెట్ ఇస్తా అని చెప్పి తీసుకెళ్లి రేప్ చేసి అక్కడి నుండి తప్పించుకున్నాడు.
విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు షేక్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. కొన్నా్ళ్ల క్రితం షేక్స్ ఓ డ్రగ్స్ కేసులో కూడా అరెస్ట్ అయ్యాడని వారు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com