Karnataka: రేణుకాస్వామి హత్య కేసులో ముగ్గురికి బెయిల్

Karnataka: రేణుకాస్వామి హత్య కేసులో ముగ్గురికి బెయిల్
X
షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసిన న్యాయస్థానం

రేణుకాస్వామి హత్యకేసులో ముగ్గురు నిందితులకు షరతులతో కూడిన బెయిల్‌ను న్యాయస్థానం మంజూరు చేసింది. అంతేకాకుండా.. వారిపై హత్యానేరం ఎత్తివేసింది. నిందితుడు కేశవ్ మూర్తికి కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరో ఇద్దరు నిందితులు కార్తీక్, నిఖిల్‌లకు కూడా బెంగళూరు సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వీరికి షరతులతో కూడిన బెయిల్ ఇస్తూ.. న్యాయమూర్తి జైశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో మొత్తం ముగ్గురిపై హత్యానేరం ఎత్తివేశారు. హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ తూగుదీప, అతని స్నేహితురాలు పవిత్ర గౌడ సహా మొత్తం 17 మంది నిందితులు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. వీరంతా.. రాష్ట్రంలోని వివిధ జైళ్లలో ఉన్నారు. ఈ కేసులో పోలీసులు సెప్టెంబర్ 4న కోర్టులో 3,991 పేజీల ప్రాథమిక చార్జిషీట్ దాఖలు చేశారు.

33 ఏళ్ల రేణుకాస్వామి నటుడు దర్శన్‌కు వీరాభిమాని. ఆమె దర్శన్ సన్నిహితురాలు పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపింది. ఇది చూసి దర్శన్ ఆగ్రహానికి గురయ్యాడు. ఈ కోపమే రేణుకాస్వామి హత్యకు కారణమైంది. సుమనహళ్లిలోని ఓ అపార్ట్‌మెంట్ సమీపంలోని కాలువలో ఆమె మృతదేహం లభ్యమైంది. కాగా.. ఈ హత్య కేసులో నటుడు దర్శన్ని పోలీసులు జూన్ 11న అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. పవిత్ర, దర్శన్ ఇద్దరూ ఒకే జైలులోనే ఉన్నారు. కోర్టు అనుమతితో పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి వచ్చిన దర్శన్ ప్రస్తుతం బళ్లారి జైలులో ఉన్నాడు.

Tags

Next Story