తప్పిపోయిన ముగ్గురు చిన్నారులు.. కారులో విగతజీవులుగా..

తప్పిపోయిన ముగ్గురు చిన్నారులు.. కారులో విగతజీవులుగా..
ముగ్గురు చిన్నారులు తప్పిపోయి 24 గంటలు అయింది. దాంతో తల్లిదండ్రుల ఆందోళన అధికమైంది.


ముగ్గురు చిన్నారులు తప్పిపోయి 24 గంటలు అయింది. దాంతో తల్లిదండ్రుల ఆందోళన అధికమైంది. కానీ అంతలోనే ఆ ముగ్గురు చిన్నారులు తమ ఇంటి బయట ఉన్న కారులో విగతజీవులుగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ముగ్గురు పిల్లలు - తౌఫిక్ ఫిరోజ్ ఖాన్ (4), అలియా ఫిరోజ్ ఖాన్ (6), అఫ్రీన్ ఇర్షాద్ ఖాన్ (6) ముగ్గురూ శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో అదృశ్యమయ్యారు. చెత్త ఏరుకుని కుటుంబాలను పోషించే వారి తల్లిదండ్రులు పిల్లలు కనిపించకపోవడంతో ఆడుకోవడానికి సమీపంలోని మైదానానికి వెళ్లి ఉంటారని భావించారు.

శనివారం సాయంత్రం వరకు పిల్లలు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కిడ్నాప్ కేసు నమోదు చేసి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. "ఆదివారం సాయంత్రం 7 గంటల సమయంలో, ఒక కానిస్టేబుల్ వారి ఇళ్లకు సమీపంలో పార్క్ చేసి ఉన్నకారుని గుర్తించారు. అనుమానంతో అక్కడికి చేరుకుని కారు డోర్ ఓపెన్ చేశారు. లోపల ముగ్గురు పిల్లల మృతదేహాలను కనుగొన్నారు. తౌఫిక్, అలియా అన్నాచెల్లెళ్లు కాగా, అఫ్రిన్ సమీపంలో నివసించినట్లు వారి స్నేహితుడు అని పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఆడుకుంటూ పిల్లలు కారు ఎక్కి ఉంటారని డోర్ లాక్ పడిపోవడంతో ఊపిరాడక పిల్లలు మరణించి ఉంటారని ప్రాథమిక దర్యాప్తులో తేలినప్పటికీ, వారి మరణానికి ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించడానికి పోస్ట్‌మార్టం నిర్వహిస్తామని నాగ్‌పూర్ పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story