Madhya Pradesh : ఇండోర్‌లో అగ్నిప్రమాదం.. ఏడుగురు సజీవదహనం...!
Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలోని స్వర్ణ్‌బాగ్ కాలనీలోని రెండంతస్తుల భవనంలో శనివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది.

Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలోని స్వర్ణ్‌బాగ్ కాలనీలోని రెండంతస్తుల భవనంలో శనివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు సజీవదహనం అయ్యారు. ఎలక్ట్రిక్ మీటర్‌లో షార్ట్‌సర్క్యూట్ జరగడం వల్ల ఈ అగ్నిప్రమాదం జరిగిందని ప్రాధమిక విచారణలో తేలింది.
ఆ తర్వాత మంటలు భవనం పైకి వ్యాపించాయని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. దాదాపుగా మూడు గంటలపాటు అగ్నిమాపక చర్యల అనంతరం మంటలను అదుపులోకి వచ్చాయి. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
మరోవైపు ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదంలో మరణించిన వారికి ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
"ఇండోర్‌లో అగ్నిప్రమాదంలో మరణవార్త అత్యంత హృదయ విదారకంగా ఉంది. దీనిపై విచారణకు ఆదేశించాను. ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటాం. మృతుల కుటుంబీకులకు ఒక్కొక్కరికి రూ. 4 లక్షల చొప్పున అందజేస్తాం " అని సీఎం చౌహాన్ ట్వీట్ చేశారు.
इंदौर के स्वर्ण बाग कॉलोनी में शॉर्ट सर्किट से हुए हादसे में कई अनमोल जिंदगियों के असमय निधन का दुखद समाचार प्राप्त हुआ।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) May 7, 2022
ईश्वर से दिवंगत आत्माओं को अपने श्रीचरणों में स्थान और परिजनों को यह गहन दुःख सहन करने की शक्ति देने तथा घायलों को शीघ्र स्वस्थ करने की प्रार्थना करता हूं।
RELATED STORIES
Water: ఎక్కువ నీరు త్రాగడం హానికరమా.. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు..
8 Aug 2022 9:15 AM GMTLIC HFL Recruitment 2022: డిగ్రీ అర్హతతో ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్లో...
8 Aug 2022 5:15 AM GMTIndian Army Recruitment 2022: ఇంజనీరింగ్ అర్హతతో ఇండియన్ ఆర్మీలో...
6 Aug 2022 5:22 AM GMTIndia Post Recruitment 2022: ఇండియా పోస్ట్ రిక్రూట్మెంట్.. టెక్నికల్...
5 Aug 2022 5:46 AM GMTTranslator posts in central government: డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ...
4 Aug 2022 5:27 AM GMTIBPS PO recruitment 2022: డిగ్రీ అర్హతతో ప్రొబేషనరీ ఆఫీసర్...
3 Aug 2022 5:13 AM GMT