Crime News: 15 ఏళ్ల బాలికకు ఇంత అసహనమా.. హారన్ కొట్టినా జరగలేదని హత్య..

Crime News: 15 ఏళ్ల బాలికకు ఇంత అసహనమా.. హారన్ కొట్టినా జరగలేదని హత్య..
Crime News: రోడ్డు మీదకు వచ్చినప్పుడు ట్రాఫిక్ మన చేతుల్లో ఉండదు.. ఎవరి గమ్యం వారు చేరుకోవడానికి ఎంతో హడావిడి పడుతుంటారు..

Crime News: రోడ్డు మీదకు వచ్చినప్పుడు ట్రాఫిక్ మన చేతుల్లో ఉండదు.. ఎవరి గమ్యం వారు చేరుకోవడానికి ఎంతో హడావిడి పడుతుంటారు..వెనక ఉన్న వాళ్లు అదే పనిగా హారన్ కొట్టి విసిగిస్తుంటారు. ముందుకు వెళ్లే దారే ఉంటే వాళ్లు మాత్రం ఎందుకు ఆగుతారు అన్న విచక్షణ కొంచెం కూడా ఉండదు వెనుక ఉన్న వారికి. వారు హారన్ కొట్టే తీరు వారు ఎంత అసహనపరులో అర్థం అవుతుంది. కొంచెం కూడా పేషెంట్స్ ఉండదు కొందరు వ్యక్తులకు.

తాజాగా జరిగిన ఓ సంఘటన ఇందుకు నిదర్శనం. 15 ఏళ్ల బాలిక హారన్ కొట్టినా జరగలేదని వినికిడి లోపం ఉన్న వ్యక్తిని కత్తితో పొడిచి చంపేసింది. ఈ దారుణ సంఘటన ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లో జరిగింది.

ఆదివారం మధ్యాహ్నం రాయ్‌పూర్‌లోని కంకాలిపరా ప్రాంతంలో రోడ్డుపై జరిగిన గొడవలో వినికిడి లోపం ఉన్న వ్యక్తిని మైనర్ బాలిక కత్తితో పొడిచి చంపింది. బాధితుడిని స్థానిక నివాసి సుదామ లాడర్‌గా గుర్తించారు.

ఆజాద్ చౌక్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అశ్విని రాథోడ్ మాట్లాడుతూ, బాధితుడు తన సైకిల్‌పై కొన్ని వస్తువులను తీసుకొని వెళుతున్నాడు. 15 ఏళ్ల బాలిక తన తల్లితో కలిసి స్కూటర్‌పై వెళ్తుందని తెలిపారు. స్కూటర్ నడుపుతున్న బాలిక ముందున్న వ్యక్తిని ఓవర్‌టేక్ చేయడం కోసం స్కూటర్ హారన్‌ను పదేపదే ప్రెస్ చేస్తోంది. అయితే బాధితుడు తనకు ఉన్న వైకల్యం కారణంగా వినిపించుకోలేదు.

ఆమెకు దారి ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన బాలిక స్కూటర్‌ను ఆపి సుదామను గట్టిగా అరిచింది. అయినప్పటికీ అతను స్పందించలేదు. యువతి కత్తి తీసి అతని గొంతులో పొడిచింది. ఆ వ్యక్తి రోడ్డుపై పడిపోవడంతో వెంటనే తోటి ప్రయాణీకులు గమనించి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు.

సుదామను కత్తితో పొడిచిన వెంటనే బాలిక తన తల్లిని అక్కడే వదిలి పారిపోయింది. పోలీసులు ఆమెను వెంబడించి నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మందిర్ హసౌద్ వద్ద పట్టుకుని అరెస్ట్ చేశారు. మృతి చెందిన సుదామ కూడా అదే ప్రాంతానికి చెందిన వాడని, వివాహితుడని పోలీసులు పేర్కొన్నారు. బాలికను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story