Vijayawada : విజయవాడలో బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారయత్నం

Vijayawada :  విజయవాడలో బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారయత్నం
Vijayawada : రేపల్లేలో మహిళపై అత్యాచార ఘటన మరువకముందే విజయవాడలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది.

Vijayawada : రేపల్లేలో మహిళపై అత్యాచార ఘటన మరువకముందే విజయవాడలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. విజయవాడలో బాలికపై ఆటో డ్రైవర్‌ అత్యాచారానికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో ఆటో డ్రైవర్ పరారైనట్లు సమాచారం.

నూజివీడుకు చెందిన బాలికకు బెంగళూరు చెందిన ఆంజనేయులు అనే వ్యక్తితో ఫేస్‌బుక్‌లో పరిచయం అయింది. ఐతే ఆంజనేయులు విజయవాడకు వచ్చినట్లు తెలుసుకున్న బాలిక అతన్ని కలిసేందుకు వచ్చింది. ఇదే సమయంలో ఆంజనేయులు ఉంటున్న హోటల్ అడ్రస్‌ చూపిస్తానంటూ బాలికను ఆటోలో ఎక్కించుకున్న డ్రైవర్‌..నేరుగా నున్న ప్రాంతంలోని పోలాల్లోకి తీసుకెల్లి అత్యాచారయత్నం చేశాడు.

ఐతే బాలిక పెద్దగా కేకలు వేయడంతో డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సహకారంతో కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేసింది బాలిక. కేసు నమోదు చేసిన పోలీసులు..నిందితుడు సింగ్‌నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్‌గా గుర్తించారు.

Tags

Read MoreRead Less
Next Story