Warangal: 900 మందిని మోసం చేసి రూ.40 కోట్లతో ఉడాయించిన ఫైనాన్షియర్..

Warangal: 900 మందిని మోసం చేసి రూ.40 కోట్లతో ఉడాయించిన ఫైనాన్షియర్..
Warangal: 2015లో కల్పవల్లి అసోసియేటెడ్‌ ఫైనాన్స్‌ అనే సంస్థను ఏర్పాటు చేసి నెలవారీ చిట్టీలు ప్రారంభించారు వెంకటేశ్వర్లు.

Warangal: కష్టపడి పైసా పైసా కూడబెట్టి చిట్టీలు కడితే.. ఆ డబ్బుతో ఉడాయించాడు ఓ ఫైనాన్షియర్‌.. కుటుంబంతో సహా ఎక్కడికో చెక్కేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.. ఈ ఘటన వరంగల్‌ నగరంలో చోటు చేసుకుంది.. స్థానిక లేబర్‌ కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు విద్యార్థులకు ట్యూషన్లు చెప్తూ చుట్టుపక్కల వారితో సఖ్యతగా ఉండేవాడు..

2015లో కల్పవల్లి అసోసియేటెడ్‌ ఫైనాన్స్‌ అనే సంస్థను ఏర్పాటు చేసి నెలవారీ చిట్టీలు ప్రారంభించారు.. మంచివాడేనని నమ్మిన జనం చిట్టీలు వేశారు.. మొత్తం 900 మంది సభ్యులతో చిట్టీలు నడుపుతున్న వెంకటేశ్వర్లు అందరినీ నమ్మించి ఓ ఫైన్‌ నైట్‌ ఎస్కేప్‌ అయ్యాడు.. ఇంటితోపాటు ఫైనాన్స్‌ ఆఫీసుకు తాళం వేసి ఉండటంతో ఫోన్‌ చేశారు.. ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్‌ రావడంతో మోసపోయామని గ్రహించి చివరకు పోలీసులను ఆశ్రయించారు..

మొత్తం 40 కోట్ల రూపాయలు వెంకటేశ్వర్లు మోసం చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.. అటు న్యాయం చేయాలంటూ బాధితులు పోలీసులను వేడుకుంటున్నారు.. అయితే, వెంకటేశ్వర్లు పెట్టిన ఫైనాన్స్‌ సంస్థ అసలు రిజిస్ట్రేషన్‌ అయిందా లేదా అనేది కూడా తెలియదని పోలీసులంటున్నారు.. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story