చేతబడి పేరుతో నగ్న పూజలు.. 9 లక్షలకు టోకరా..

నంద్యాల జిల్లాలో చేతబడి పేరుతో మహిళకు టోకరా వేశాడు ఓ మోసగాడు. ఒకరికి తెలియకుండా మరొకరితో ఆమె కుటుంబసభ్యులతో నగ్నపూజలు చేయించాడు. అంతేకాదు ఏకంగా 9 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన చాగలమర్రి మండలంలో జరిగింది. బాధితురాలి భర్తకు ఆరోగ్యం సరిగా లేదు. ఇది తెలుసుకున్న ముత్తలూరు గ్రామానికి చెందిన లక్ష్మీ, సాయమ్మలు చేతబడి చేశారంటూ ఆమెను నమ్మించారు. విరుగుడు పూజలు చేయాలని 3 లక్షలు వసూలు చేశారు.అయినా ఆరోగ్యం మెరుగు కాకపోవడంతో తమకంటే పెద్ద స్వామితో పూజలు చేయించాలన్నారు.
చాబోలు కి చెందిన పోలూరు మహమ్మద్ హుస్సైన్ పిలిపించుకున్నారు. మహమ్మద్ హుస్సైన్ మాయమాటలు చెప్పి 6 లక్షలు వసూలు చేశాడు. అంతేకాదు ఆమె కుటుంబ సభ్యులను ఒకరికి తెలియకుండా ఒకరితో నగ్న పూజలు చేయించాడు. బాధిత మహిళా నిలదీయడంతో ఆమెను సైతం బలవంతం చేయబోయాడు. ఆమె తప్పించుకుని చాగలమర్రి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందుతుల్ని అరెస్టు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com