East Godavari: నగ్న ఫోటోలతో లోన్ యాప్ బెదిరింపులు.. యువకుడు సూసైడ్..

East Godavari: లోన్ యాప్ ఆగడాలు ఏమాత్రం ఆగడం లేదు. తీవ్రమైన ఒత్తిడి తెచ్చి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో లోన్ యాప్ వేధింపులు తట్టుకోలేక కోనా సతీష్ ఆత్మహత్య చేసుకున్నాడు. కడియం గ్రామానికి చెందిన కోనా సతీష్ ఓ యాప్ ద్వారా చదువు కోసం లోన్ తీసుకున్నాడు. తిరిగి చెల్లించడం ఆలస్యం అవడంతో యాప్ సంస్థ నుంచి వేధింపులు మొదలయ్యాయి.
నగ్నంగా ఉన్న ఫోటోలకు సతీష్ తల అంటించి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు యాప్ నిర్వాహకులు. సతీష్ స్నేహితుల వాట్సప్ నంబర్లకు అవే ఫొటోలు పంపించారు. ఆ అవమానం భరించలేక భీమవరంలో ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సతీష్ మార్ఫింగ్ ఫొటోలు చూసిన తరువాత గాని తల్లిదండ్రులకు ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు.
వేధింపులు తట్టుకోలేక సతీష్ ఆత్మహత్య చేసుకున్నా సరే.. లోన్ యాప్ ఆగడాలు మాత్రం ఆగలేదు. సతీష్ కుటుంబసభ్యులకు వార్నింగ్ మెసేజ్‌లతో పాటు మార్ఫింగ్ చేసిన సతీష్ నగ్నచిత్రాలను సైతం పంపిస్తూనే ఉన్నారు. అప్పు కట్టకపోతే కుటుంబసభ్యుల ఫొటోలు కూడా అందరికీ పంపిస్తామని బెదిరించారు. దీంతో సతీష్ కుటుంబ సభ్యులు కడియం పోలీసులకు ఫిర్యాదుచేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com