Srisailam: శ్రీశైలంలో తీవ్ర ఉద్రిక్తత.. కర్ణాటకవాసిని గొడ్డలితో నరికిన స్థానికుడు..

Srisailam: శ్రీశైలంలో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక సత్రం దగ్గరి టీ దుకాణం ముందు చిన్నగా ప్రారంభమైన గొడవ.. స్థానికులకు, కర్ణాటక వాసులకు మధ్య ఘర్షణకు దారి తీసింది. కర్ణాటకకు చెందిన ఒకరిని స్థానికుడు గొడ్డలితో నరికాడు. వెంటనే.. సున్నిపెంట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ పరిణామంతో కన్నడిగులు రెచ్చిపోయారు.. మూకుమ్మడిగా దాడికి దిగారు. శ్రీశైలంలో రోడ్లకు ఇరువైపు ఉన్న దుకాణాలను ధ్వంసం చేశారు.
పాతాళగంగ, నంది సర్కిల్, పరిపాలన భవన్ ముందు లైన్లలోని.. తాత్కాలిక షాపులను పూర్తిగా ధ్వంసం చేశారు. పరిస్థితి తీవ్రతను గమనించిన ఈవో లవన్న.. జగద్గురు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చెన్న సిద్దరామ పండితారాధ్య, శివాచార్య.. కర్ణాటక స్వాములతో మాట్లాడారు. ఉద్రిక్తతను తగ్గించే ప్రయత్నం చేశారు. అటు.. ప్రత్యేక పోలీసు బృందాలతో రంగంలోకిక దించిన అధికారులు.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com