క్రైమ్

Nellore : ప్రియురాలిని కాల్చిచంపి ప్రియుడు ఆత్మహత్య...!

Nellore : నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తిలో కాల్పులు సంచలనం రేపుతున్నాయి.

Nellore : ప్రియురాలిని కాల్చిచంపి ప్రియుడు ఆత్మహత్య...!
X

Nellore : నెల్లూరు జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించడంతో యువకుడు ప్రేమించిన యువతిపై విచక్షణా రహితంగా తుపాకీతో కాల్పులు జరపడం సంచలనంగా మారింది. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామంలో చోటు చేసుకున్న ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

తాడిపత్రికి చెందిన సురేష్ రెడ్డి, కావ్య వృత్తిరీత్యా సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్లు. సురేష్ రెడ్డి బెంగళూరులో, కావ్య పుణెలోని సాఫ్ట్ వేర్ ఉద్యోగులుగా స్థిరపడ్డారు. కరోనా నేపథ్యంలో వర్క్ ఫ్రం హోమ్ కావడంతో కావ్య తాడిపర్తిలోని ఇంటి వద్దనే ఉండి విధులు నిర్వహించింది. సురేష్ రెడ్డి మాత్రం బెంగళూరులో సాఫ్ట్‌ వేర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే కావ్యకి వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయిస్తున్నారని తెలుసుకున్న సురేష్ రెడ్డి.. మొదటి నుండి కావ్య అంటే ఇష్టం ఉండటంతో ఆమె తల్లిదండ్రులను సంప్రదించాడు.

కావ్యను తనకిచ్చి పెళ్లి చేయాలని అడిగాడు. అయితే సురేష్ రెడ్డికి ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేనిదని ఆమె తల్లిదండ్రులు నిరాకరించడంతో తనతో తెచ్చుకున్న గన్‌తో కావ్యపై విచక్షణా రహితంగా నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు. మూడు రౌండ్లు మిస్ అయిన నాలుగో రౌండ్లో కావ్య నుదిటి పైన బుల్లెట్ తగలడంతో ఆమె అక్కడిక్కడే కుప్పకూలిపోయింది. క్రింద పడిపోయిన కావ్యను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా... మార్గం మధ్యలోనే ఆమె మృతి చెందింది.

కావ్య పై కాల్పులు జరిపిన సురేష్ రెడ్డి.. అక్కడి నుంచి వెళ్లిపోయి... సమీపంలోని డాబా వద్దకు చేరుకుని పాయింట్ బ్లాక్‌లో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కాల్పుల ఘటనలో సురేష్, కావ్య ఇద్దరు మృతి చెందడంతో తాటిపర్తిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే గ్రామానికి చెందిన యువతియువకులిద్దరు ప్రేమ కారణంగా మృతి చెందడం రెండు కుటుంబాలు పుట్టెడు దుఃఖంలో మునిగిపోయాయి.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాటిపర్తిలో పుట్టి పెరిగిన సురేష్ రెడ్డి ఇతరులతో అంత త్వరగా మాట్లాడే తత్వం కాదని, అందరితో కలివిడిగా కలిసే వ్యక్తి కూడా కాదని తెలుస్తుంది. అయితే సురేష్ రెడ్డి ఎలా రివాల్వర్ సంపాదించగలడు..? అతనికి రివార్వర్‌ ఇచ్చినవారెరు అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. గన్ పై మేడిన్ USA అని ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Next Story

RELATED STORIES