Nizamabad: రియల్ ఎస్టేట్ పేరుతో ఘరానా మోసం.. రూ.5 కోట్లతో నిందితుడు పరారీ..

X
Nizamabad: రియల్ ఎస్టేట్ పేరుతో నిజామాబాద్ జిల్లాలో ఓ కేటుగా ఘరానా మోసానికి పాల్పడ్డాడు. వెంచర్‌లో ప్లాట్‌లు కేటాయిస్తానంటూ సుమారు ఐదు కోట్ల రూపాయలు సేకరించి పరారయ్యాడు. డిచ్‌పల్లి మండలం ధర్మారంలో దశరథ్ అనే వ్యక్తి..వెంచర్‌లో ప్లాట్లు విక్రయిస్తున్నట్లు స్థానికుల వద్ద డబ్బులు సేకరించాడు. మొత్తం చెల్లింపుల తర్వాతే రిజిస్ట్రేషన్ చేస్తానని నమ్మబలికాడు. డబ్బులు చెల్లించినా స్థలాలు కేటాయించకపోవటంపై బాధితులు దశరథ్‌ని నిలదీశారు. బాధితుల ఒత్తిడి పెరగటంతో కనిపించకుండపోయాడు. పైస పైస కూడబెట్టిన తమను నట్టేట్టముంచాడని బాధితులు లబోదిబోమంటున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
