చాటింగ్‌‌తో చీటింగ్.. రూ.3 కోట్లు వసూలు..!

చాటింగ్‌‌తో చీటింగ్.. రూ.3 కోట్లు వసూలు..!
చిత్తూరు జిల్లాలో డబ్బున్న యువతులకు పెళ్లి పేరుతో వల వేసి... 3 కోట్ల రూపాయలు వసూలు చేసిన కేటుగాడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

చిత్తూరు జిల్లాలో డబ్బున్న యువతులకు పెళ్లి పేరుతో వల వేసి... 3 కోట్ల రూపాయలు వసూలు చేసిన కేటుగాడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. సింగరాయునిపేట, మదనపల్లెలో యువకుడిపై చీటింగ్‌ కేసులు నమోదు కాగా... గాలింపు చేపట్టిన పోలీసులు నిందితుడు శ్రీనివాస్‌ను అరెస్ట్‌ చేశారు. మొత్తం 11 మంది మహిళలు ఫిర్యాదు చేయగా... మరో ఏడుగురు యువతులు మోసపోయినా ఫిర్యాదు చేసేందుకు ముందుకురాలేదని తెలుస్తోంది.

మ్యాట్రిమొనీ సైట్లు, డేటింగ్‌ యాప్‌ల ద్వారా అమ్మాయిల ప్రొఫైళ్ల చెక్‌ చేసే శ్రీనివాస్‌... డబ్బున్న యువతుల ఫోన్‌ నెంబర్లు సేకరించాడు. ఒక్కొక్కరితో ఒక్కో నెంబర్‌ ద్వారా ఛాటింగ్‌ చేసి... పెళ్లి చేసుకుంటానంటూ మాయమాటలు చెప్పాడు. కష్టాలు ఉన్నాయంటూ నమ్మించి.... ఒక్కొక్కరి నుంచి లక్షలకు లక్షలు డబ్బు వసూలు చేశాడు.

ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కోటికాలపూడికి చెందిన నిందితుడు శ్రీనివాస్‌పై... గతంలో హైదరాబాద్‌లోని మియాపూర్‌, రాయదుర్గంలోనూ ఇదే తరహా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు తాజాగా గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన ఐటీ ఉద్యోగిని నుంచి 40లక్షల రూపాయలు, ఒంగోలుకు చెందిన ఐటీ ఉద్యోగి నుంచి 27లక్షలు, మదనపల్లెకు చెందిన వైద్యురాలు నుంచి 7లక్షలు చిత్తూరు చెందిన మరో ఐటీ ఉద్యోగి నుంచి లక్షా 40వేల రూపాయలు వసూలు చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది.

Tags

Next Story