Vijayawada Suicide : పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో

Vijayawada Suicide : పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో
X
Vijayawada Suicide : కృష్ణా జిల్లా చందర్లపాడులో సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది.. పోలీసులు వేధిస్తున్నారంటూ ఓ వ్యక్తి సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు..

Vijayawada Suicide : కృష్ణా జిల్లా చందర్లపాడులో సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది.. పోలీసులు వేధిస్తున్నారంటూ ఓ వ్యక్తి సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు.. ఆ వెంటనే పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.. కుటుంబ సభ్యులు హుటాహుటిన అతన్ని ఆస్పత్రికి తరలించారు.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.. చందర్లపాడు మండలం గుడిమెట్లకు చెందిన నరేష్‌ అనే వ్యక్తి.. పోలీసులపై ఆరోపణలు చేశాడు.. తాను ఇసుక తరలించపోయినప్పటికీ తరలిస్తున్నానని నేరం మోపి బైండోవర్‌ కేసు పెడతానని ఎస్సై కృష్ణారావు వేధిస్తున్నారంటూ సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు.. తరచుగా పోలీసులు ఫోన్‌ చేస్తుండటంతో తట్టుకోలేక మరణమే శరణ్యమంటూ పురుగులమందు తాగాడు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది.

Tags

Next Story