Mumbai: రూ.100 వల్ల గొడవ.. చివరికి ప్రాణాలు తీసింది..

Mumbai: కోపంలో చేసే పనుల వల్ల మనుషుల ప్రాణాలే పోతున్నాయి. ఒక్క రూపాయి కూడా మనిషి మరణానికి కారణమవుతోంది. ఒక్క రూపాయితో మొదలయిన గొడవ మెల్లగా వాగ్వాదానికి దారితీస్తుంది. అది కాస్త విచక్షణ కోల్పోయి మనిషి ప్రాణాలు పోయే వరకు తీసుకొస్తుంది. తాజాగా ముంబాయిలో కూడా అలాంటి ఓ ఘటనే చోటుచేసుకుంది.
ముంబాయిలోని దహీసర్ ప్రాంతంలో 28 ఏళ్ల పరమేశ్వర్ కోకటేకు 40 ఏళ్ల రాజు పాటిల్ అనే ఫ్రెండ్ ఉన్నాడు. కొన్నిరోజుల క్రితం రాజు బంధువు ఒకరు పరమేశ్వర్ నుండి రూ.100 అప్పుగా తీసుకున్నారు. తర్వాత ఎన్నిసార్లు అడిగినా వారు ఆ డబ్బు తిరిగి ఇవ్వడం లేదు. దీని వల్ల రాజుకు, పరమేశ్వర్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
రాజు, పరమేశ్వర్ మధ్య వాగ్వాదం కాస్త హత్యకు దారితీసింది. ఆ సమయంలో బాగా కోపంతో రగిలిపోయిన పరమేశ్వర్.. రాజును కొట్టి చంపాడు. ఆ తర్వాత అది ఆత్మహత్యలాగా కనిపించడం కోసం మృతదేహాన్ని తగలబెట్టాడు. రాజు మృతిపై అనుమానం ఉన్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా పరమేశ్వర్ తన తప్పును ఒప్పుకున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com