Visakhapatnam: విశాఖ జిల్లాలో దారుణ హత్య.. రోడ్డుపైకి ఈడ్చుకు వచ్చి..

Visakhapatnam: విశాఖ జిల్లాలో దారుణ హత్య జరిగింది. అల్లిపురం రోడ్డులో శ్రీనివాస్ అనే వ్యక్తిని ఓ దుండగుడు దారుణంగా మర్డర్ చేశాడు. హత్య అనంతరం శ్రీనివాస్ మృతదేహాన్ని రోడ్డుపైకి ఈడ్చుకు వచ్చాడు. ఈ దృశ్యాలు సీసీ టీవీల్లో రాకార్డయ్యాయి. ఉదయం 5గంటల ప్రాంతంలో శ్రీనివాస్ నడిచి వెళ్తుండగా.. ఎదురుగా ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరిని చూసి వీధిలోకి పరుగులు తీశాడు.
ఇద్దరు వ్యక్తుల్లో ఓ యువకుడు శ్రీనివాస్‌ను వెంబడించి దాడి చేసి చంపేశాడు. అనంతరం శ్రీనివాస్ మృతదేహాన్ని రోడ్డుపై ఈద్చుకుంటూ తీసుకువచ్చాడు. ద్విచక్రవాహనంపై ఓ మహిళ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పెయింటర్‌గా పనిచేసే శ్రీనివాస్‌ని ఎవరు చంపారు. మర్డర్ వెనుక అసలు కారణాలేంటనే దానిపై పోలీసులు అన్వేషిస్తున్నారు. శ్రీనివాస్ అల్లిపురంలోనే తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com