ఆస్తి కోసం బావమరిదిని చంపిన బావలు

మెదక్ జిల్లా కొల్చారం మండలం అప్పాజీపల్లిలో దారుణం జరిగింది. ఆస్తి కోసం బావమరిదిని ఇద్దరు బావలు కిరాతకంగా చంపేసారు. బెడ్‌రూంలో నిద్రిస్తున్న శేకులుపై బావలు కర్రలతో దాడి చేసారు. దీంతో బావమరిది శేకులు అక్కడికక్కడే మృతి చెందాడు. కొడుకుపై దాడిని అడ్డుకోవాల్సిన తల్లి సైతం అల్లుళ్లకు సహకరించింది. తల్లి, అక్కలు, ఇద్దరు బావలు కలిసి.. శేకులను కడతేర్చారు.
రక్తపు మరకలు ఉన్న శేకులు బట్టలను తల్లి, బావలు డ్రమ్ములో దాచిపెట్టారు. ఆ తర్వాత మృతదేహానికి వేరే బట్టలు వేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే అనుమానంతో గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గ్రామానికి వచ్చి పోలీసులు విచారణ చేపట్టగా.. శేకులు మర్డర్ విషయం బయటపడింది. ఏడుపాయల ఆలయం వద్ద శేకులు పేరు మీద కోటిన్నర రూపాయల విలువైన భూమి ఉందని.. ఆ భూమిని కాజేయాలనే బావలు మర్డర్ స్కెచ్ వేశారని గ్రామస్తులు అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com