chittoor : చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో పసికందు కిడ్నాప్

chittoor : చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో పసికందు కిడ్నాప్ సంచలనం రేపుతోంది. ప్రసూతి వార్డులో తల్లి పక్కన నిద్రిస్తున్న పసిబిడ్డను... ముగ్గురు గుర్తు తెలియని మహిళలు ఎత్తుకెళ్లారు. తెల్లవారుజాము నాలుగు గంటల సమయంలో పసిబిడ్డను ఒక బ్యాగులో పెట్టుకుని ముగ్గురు మహిళలు ఎత్తికెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా ధర్యాప్తు చేస్తున్నారు. రైల్వే స్టేషన్, బస్టాండ్ సహా నగరంలోని అన్ని ఆస్పత్రులను తనిఖీ చేస్తున్నారు.
చిత్తూరుకు చెందిన షబానా అనే మహిళ... సోమవారం నాడు మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇవాళ డిశ్చార్జ్ కావాల్సి ఉండగా... తెల్లవారుజాము సమయంలో బిడ్డను ఎత్తుకెళ్లారు. తల్లి పక్కన నిద్రిస్తుండగా అదును చూసి, బిడ్డను అపహరించారు. ఉదయం చూసే సరికి తమ బిడ్డ పోలీసులకు కంప్లైంట్ చేశారు. వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ సిబ్బందిని కూడా విచారిస్తున్నారు. సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యమే తమ బిడ్డ కిడ్నాప్‌కు కారణమని బాధితులు కన్నీళ్లు పెడుతున్నారు.
ఇటీవలె ఇలాంటి అపహరణ ఘటనే విశాఖ కేజీహెచ్‌లోనూ చోటు చేసుకుంది. తల్లి నుంచి చిన్నారిని కిడ్నాప్ చేశాయి. అయితే చిన్నారి ఆచూకీని పోలీసులు వెంటనే కనిపెట్టగలిగారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో చిన్నారిని గుర్తించి, నిందితులను అరెస్ట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com