Hyderabad. : పోచారంలో గంజాయి చాక్లెట్ల కలకలం

పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నోజిగూడ ఫ్లై ఓవర్ వద్ద గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ఇద్దరు టీ స్టాల్ నిర్వాహకులను ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఓటీ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అన్నోజిగూడ ఫ్లై ఓవర్ వద్ద టీ స్టాల్ నిర్వహిస్తున్న రామ్ నారాయణ్(33), కిషోర్ కుమార్(22)లు గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నారని పక్కా సమాచారంతో మంగళవారం టీ స్టాల్ నిర్వాహకులను అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నించారు. టీ స్టాల్ నిర్వాకులు తాము గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నట్లు ఒప్పుకోవడంతో వెంటనే వారిని అరెస్టు చేసి, వారి వద్ద ఉన్న 1190 గ్రాముల 230 చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. తర్వాత నిందితులు ఇద్దరిని గంజాయి చాక్లెట్లను పోచారం ఐటి కార్డార్ పోలీస్ స్టేషన్లో అప్పగించామని తెలిపారు. ఈ మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com