Yadadri : ఇంటర్మీడియట్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ .. ఎగ్జామ్ హాల్‌కి సెల్‌ఫోన్ తీసుకొచ్చాడు..!

Yadadri : యాదాద్రి భువనగిరి జిల్లాలో.. మోత్కూరులో ఇంటర్మీడియట్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ కలకలం రేపుతోంది. స్థానిక అక్షర జూనియర్ కాలేజ్ లో పరీక్షలు జరుగుతున్నాయి.. ఈ క్రమంలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్‌కు చెందిన ఓ విద్యార్థి పరీక్షా కేంద్రానికి సెల్‌ఫోన్ తీసుకొచ్చాడు. మెయిన్ గేట్ దాగ్గర చెక్ చేసిన వాళ్లు సెల్‌ఫోన్‌ని గుర్తించలేదు. దీంతో దర్జాగా కాపీయింగ్‌కు పాల్పడ్డాడు.
అయితే పరీక్ష మరో అరగంటలో ముగుస్తుందనగా.. విద్యార్థి సెల్‌ఫోన్‌లో చూసి కాపీయింగ్‌కు పాల్పడుతున్నాడన్న విషయాన్ని గుర్తించిన ఇన్విజిలేటర్... యువకుడిని చితకబాదాడు. మరోవైపు ఈ ఘటనపై చీఫ్ సూపరింటెండెంట్‌ను వివరణ కోరగా.. అలాంటివేవి జరిగినట్లు తన దృష్టికి రాలేదన్నారు. దీనిపై దర్యాప్తు చేస్తామన్నారు. అయితే ఎగ్జామ్ సెంటర్‌లోకి ఫోన్ ఎలా వచ్చింది.. విద్యార్థిని ఎందుకు చితకబాదారు అన్న విషయాలపై వివరణ ఇవ్వలేదు.
ఇక ఇదే సెంటర్లో ఎగ్జామ్స్ ప్రారంభమైన తొలి రోజు ఓ విద్యార్థి బ్లూటూత్ డివైజ్‌తో ఎగ్జామ్ హాల్ లోకి రాగా.. ఇన్విజిలేటర్ దానిని చూసి లాక్కొన్నారు. ఈ సెంటర్‌లో జరుగుతున్న తంతంగంపై ఇంటర్మీడియల్ అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com