Kadapa: మైనర్‌ బాలికపై వాలంటీర్‌ అత్యాచారయత్నం.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన..

Kadapa: మైనర్‌ బాలికపై వాలంటీర్‌ అత్యాచారయత్నం.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన..
Kadapa: మహిళల రక్షణ కోసం రూపుదిద్దుకున్న దిశ చట్టం.. సీఎం సొంత జిల్లా కడపలో నీరుగారిపోతోందన్న విమర్శలు వస్తున్నాయి.

Kadapa: మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న దిశ చట్టం.. సీఎం సొంత జిల్లా కడపలో నీరుగారిపోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దువ్వూరు మండలం మనేరాంపల్లిలో మైనర్‌ బాలికపై వాలంటీర్‌ అత్యాచారానికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న మైనర్‌ బాలికపై వాలంటీర్‌ అమ్మిరెడ్డి నాగేంద్ర రెడ్డి దాడి చేసి.. అత్యాచారానికి యత్నించాడనే ఆరోపణలున్నాయి.

బాలిక భయంతో కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న వారు వచ్చి.. వాలంటీర్‌ను చితకబాదారు. అనంతరం పోలీసులు వాలంటీర్‌ను అదుపులోకి తీసుకొని.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే వార్డు వాలంటీర్‌ ఫిర్యాదుతో పోలీసులు తమను వేధిస్తున్నారని.. బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అన్యాయం జరిగిందని పోలీసులను ఆశ్రయిస్తే.. తమపైనే కేసులు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story