Visakhapatnam: కాబోయే భర్తపై యువతి హత్యాయత్నం.. కళ్లకు గంతలు కట్టి కత్తితో గొంతుకోసి..

X
Visakhapatnam: విశాఖ జిల్లాలో కాబోయే వరుడిపై యువతి హత్యాయత్నం చేయడం సంచలనం సృష్టిస్తోంది. అనకాపల్లి బుచ్చయ్యపేట మండలం కొమళ్లపూడిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వచ్చే నెల వివాహం చేసుకునేందుకు ఈ జంటకు నిశ్చితార్థం కూడా జరిగింది. షాపింగ్ పేరుతో యువకుడిని బయటకు తీసుకెళ్లిన యువతి.. సరదాగా అంటూ కళ్లకు గంతలు కట్టి కత్తితో దాడికి దిగింది. గాయపడ్డ రామునాయుడుని అనకాపల్లి ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. యువతి కోసం గాలిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
