వివాహిత స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో.. భర్త మరణించినా కూడా..

తూర్పు గోదావరి జిల్లా కూనవరం. వెంకట రమణ తాపీ మెస్త్రిగా పనిచేస్తుండేవాడు. ఆరేళ్ల క్రితం శరణ్య అనే అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు.. ఇదే జిల్లా మాచవరానికి చెందిన మోహన్ అనే వ్యక్తి తనకు పని ఇవ్వాలంటూ రమణకు అడిగాడు. దీంతో అతన్ని తన వద్దనే మెస్త్రీగా పనిలో పెట్టుకున్నాడు. అయితే.. తాను ఎంత తప్పు చేసాడో తర్వాతే తెలిసింది రమణకి.
ఏడాది క్రితం రమణ భార్యపై మోహన్ కన్ను పడింది. ఎలాగైనా లొంగ దీసుకోవాలని శతవిధాల ప్రయత్నించాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో కోపం పెంచుకున్న మోహన్.. ఆమె నగ్నదృశ్యాలు, బెడ్ రూమ్ దృశ్యాలను రికార్డు చేసి బ్లాక్‌మెయిల్ చేశాడు. ఈ విషయం భర్తకి చెప్పడంతో మోహన్‌కు దేహ శుద్ధి చేసి తరిమేశాడు రమణ.
అయితే 4 నెలల క్రితం భర్త రమణ కరోనా సోకి మరణించాడు. భర్త పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమెన మళ్లీ వేధిస్తున్నాడు మోహన్. వీడియోలు షేర్ చేస్తానంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పిన బాధితురాలు వారి సహకారంతో కూనవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడ్ని అదుపులో తీసుకున్నారు. నమ్మి ఆశ్రయమిచ్చిన పాపానికి... మోహన్.. ఇలాంటి దారుణానికి ఒడిగట్టాడు. ఇలాంటి కీచకులకు కఠినంగా శిక్షించాలని పోలీసుల్ని కోరుతున్నారు బాధితురాలు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com