అప్పిచ్చినందుకు అన్యాయంగా ఆమెను.. !

అప్పిచ్చినందుకు అన్యాయంగా ఆమెను.. !
తీసుకున్న అప్పు తిరిగి చెల్లించమందని ఆమెను అడ్డంగా నరికేశారు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు శరీరాన్ని ముక్కలుగా నరికి కాలువలో పడేశారు.

తీసుకున్న అప్పు తిరిగి చెల్లించమందని ఆమెను అడ్డంగా నరికేశారు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు శరీరాన్ని ముక్కలుగా నరికి కాలువలో పడేశారు. ఢిల్లీలోని నజాఫ్‌గర్ ప్రాంతంలో ఒక వృద్ధ మహిళను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని కాలువలోకి విసిరిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఈ జంట మహిళ నుండి 1 లక్షల రుణం తీసుకుని దానిని తిరిగి చెల్లించలేకపోయింది.

అనిల్ ఆర్య, అతని భార్య తనూ తమ నేరాన్ని అంగీకరించారని, మృతదేహాన్ని నజాఫ్‌గర్ కాలువలో పడవేసే ముందు ముక్కలుగా నరికి చంపారని పోలీసులు తెలిపారు. అనిల్ ఈవెంట్ మేనేజర్‌గా పని చేస్తుంటాడు. అతడు అవసరం నిమిత్తం కవితా గ్రోవర్ అనే మహిళ వద్దనుంచి లక్షరూపాయలు అప్పుగా తీసుకున్నారు.

75 ఏళ్లున్న ఆ మహిళ తీసుకున్న లక్ష రూపాయలను తిరిగి ఇమ్మని అనిల్‌ని అడిగింది. ఇదిగో ఇస్తా అదిగో ఇస్తా అని ఎన్ని సార్లు అడిగినా దాటవేస్తున్నాడు. ఆమెను చంపేస్తే అప్పు తీర్చే పనుండదని ప్లాన్ వేశారు అనిల్ దంపతులు. అరెస్టయితే జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుందని అనుకోలేదు. పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు.

నిందితుడు అనిల్ పోలీసులతో మాట్లాడుతూ, తన డబ్బును తిరిగి ఇవ్వమని మహిళ నిరంతరం కోరుతూ ఉంది. దీంతో విసుగు చెంది చంపేశామని చెప్పాడు. అదే పరిసరాల్లో నివసిస్తున్న ఈ జంట తన ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు గొంతు కోసి చంపినట్లు పోలీసులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story