క్రైమ్

Nalgonda: నల్గొండలో దారుణం.. యువకుడి కిడ్నాప్.. ఆపై హత్య.. స్నేహితులే హంతకులు..?

Nalgonda: నల్గొండ జిల్లా అయిటిపాముల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది.

Nalgonda: నల్గొండలో దారుణం.. యువకుడి కిడ్నాప్.. ఆపై హత్య.. స్నేహితులే హంతకులు..?
X

Nalgonda: నల్గొండ జిల్లా అయిటిపాముల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఐదు రోజుల క్రితం కిడ్నాప్‌ అయిన యువకుడు రాజశేఖర్‌... హత్యకు గురయ్యాడు. రామచంద్రగూడెం శివారులో అతని మృతదేహాన్ని గుర్తించారు. స్నేహితులే రాజశేఖర్‌ను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు దారి తీసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మర్డర్‌ తర్వాత రాజశేఖర్‌ మృతదేహాన్ని పూడ్చి పెట్టినట్లుగా గుర్తించారు. అయితే డెడ్‌బాడీని.. ఇంకా అతని కుటుంబ సభ్యులకు అప్పగించలేదు. ఈ కేసుపై క్లూస్‌ టీంతో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES