ప్రియుడితో పెళ్లికోసం యువతి మౌనపోరాటం.. ప్రేమించలేదంటూ మొండికేసిన ప్రియుడు

ప్రియుడితో పెళ్లికోసం యువతి మౌనపోరాటం.. ప్రేమించలేదంటూ మొండికేసిన ప్రియుడు
తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం కేశనపల్లి గ్రామంలో ప్రియుడితో పెళ్లి కోసం ఓ యువతి మౌనపోరాటానికి దిగింది.

తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం కేశనపల్లి గ్రామంలో ప్రియుడితో పెళ్లి కోసం ఓ యువతి మౌనపోరాటానికి దిగింది. సుబ్బారావు, రామానుజమ్మ వరుసకు బావామరదళ్లు. గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నామని, తీరా పెళ్లి చేసుకుందామనేసరికి ముఖం చాటేస్తున్నాడని వాపోయింది. చేసేదిలేక తన బావతో పెళ్లి చేయాలంటూ రామానుజమ్మ మౌనపోరాటానికి దిగింది. పోలీసులు ఇరువురికి కౌన్సిలింగ్‌ ఇవ్వగా, తాను ప్రేమించలేదని సుబ్బారావు తేల్చిచెప్పాడు. మరోవైపు సబ్బారావుపై ఫిర్యాదు చేయడానికి బాధితురాలు అంగీకరించకపోవడంతో పోలీసులకు ఏంచేయాలో తెలియని పరిస్థితి నెలకొంది.

Tags

Read MoreRead Less
Next Story