Aanvi Kamdar : రీల్స్ చేస్తూ లోయలో పడి యువతి మృతి

ముంబైకి చెందిన ట్రావెల్ ఇన్‌ఫ్లూయెన్సర్ అన్వీ కామ్‌దార్(26) ( Aanvi Kamdar ) స్నేహితులతో రాయ్‌గడలోని కుంభే జలపాతానికి వెళ్లారు. అక్కడ రీల్స్ చేసేందుకు లోయ అంచున నిలబడగా కాలు జారి 300 అడుగుల లోయలో పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసు, ఫైర్ సిబ్బంది 6 గంటలు కష్టపడి అన్వీని కాపాడారు. కానీ తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రిలో చేర్చిన కాసేపటికే ఆమె మరణించారు. అన్వీకి సోషల్ మీడియాలో 2లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.
ఇటీవలి కాలంలో రీల్స్ పిచ్చి మరింత ఎక్కువైపోతుంది. చాలామంది సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఫుల్ ఫేమస్ అవ్వాలనే ఉద్దేశ్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కొన్ని సందర్భాలలో ప్రమాదకర స్టంట్స్‌తో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అంతే కాదు ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ భయాందోళనకు గురిచేస్తున్నాయి. వాటిని చూసి తమ పిల్లలు కూడా ప్రయత్నించి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారేమోనని తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. అయితే కొందరు రీల్స్ చేసి తమ టాలెంట్‌ను ప్రూవ్ చేసుకుంటుంటే మరి కొందరు మాత్రం రీల్స్ పిచ్చితో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com