Srikalahasti Tahsildar Office : శ్రీకాళహస్తి తహశీల్దార్ ఆఫీస్ లో ఏసీబీ సోదాలు

X
By - Manikanta |29 April 2025 12:15 PM IST
శ్రీకాళహస్తి తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. గత కొన్ని రోజులుగా శ్రీకాళహస్తి తాసిల్దార్ కార్యాలయంలో డీకేటి భూములను ఆన్లైన్లో ఎక్కించారన్న అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. సర్వేయర్ పురుషోత్తం, తహసిల్దార్ లక్ష్మీనారాయణను అధికారులు ప్రశ్నించారు. శ్రీకాళహస్తి మండల సర్వే పురుషోత్తం 25 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ దాడుల్లో అడిషనల్ ఎస్పీ విమల కుమారి డి.ఎస్.పి ప్రశాంతి పాల్గొన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com