Acid Attack : ప్రేమికుల దినోత్సవం నాడు దారుణం..సీఎం, హోంమంత్రి ఆగ్రహం

ప్రేమికుల దినోత్సవం నాడు అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. గుర్రంకొండ మం. ప్యారంపల్లికి చెందిన ఓ యువతికి (23)కి ఏప్రిల్ 29న శ్రీకాంత్ అనే వ్యక్తితో పెళ్లి కావాల్సి ఉంది. ఈ విషయం తెలిసి ఆమెను ప్రేమించిన గణేశ్ సైకోలా మారాడు. ఇక ఆమె తనకు దక్కదని భావించి యువతి తలపై కత్తితో దాడి చేసి ముఖంపై యాసిడ్ పోశాడు. యువతికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.
న్నమయ్య జిల్లాలో యువతిపై జరిగిన యాసిడ్ దాడిని సీఎం చంద్రబాబు ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యువతికి మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. అలాగే, ఈ ఘటనపై మంత్రి లోకేశ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన సైకోను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. భవిష్యత్తులో మరో చెల్లిపై దాడి జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టాలన్నారు.
ఇక ఘటనపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆమె బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. బాధితురాలిని మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com