ఘోర కారు ప్రమాదం నుంచి బయటపడ్డ నటి గాయత్రీ జోషి.. ఇద్దరు మృతి

నటి గాయత్రీ జోషి ఆమె భర్త వికాస్ ఒబెరాయ్ ఇటలీలో జరిగిన ఘోర కారు ప్రమాదం నుండి తప్పించుకున్నారు. గాయత్రీ జోషి ఆమె భర్త వికాస్ ఒబెరాయ్ విహార యాత్రకని ఇటలీ వెళ్లారు. అక్కడ కార్ రేసింగ్ లో పాల్గొన్నారు. ఆ సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దంపతులు ప్రయాణిస్తున్న లంబోర్గినీ అత్యంత వేగంతో వెళ్లి క్యాంప్ వ్యాన్ ను ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించింది. దాంతో వ్యాన్ తో పాటు, దాని ముందు ఉన్న ఫెరారీని కూడా ఢీ కొట్టింది. ఫలితంగా వ్యాన్ బోల్తా పడింది. ఫెరారీలో ప్రయాణిస్తున్న స్విస్ దంపతులు ప్రాణాలు కోల్పోయారు.
గాయాలతో బయటపడ్డ గాయత్రి ఒక న్యూస్ పోర్టల్‌తో మాట్లాడుతూ, 'నేను మరియు వికాస్ ఇటలీలో ఉన్నాము. ఇక్కడ ప్రమాదానికి గురయ్యాం.. దేవుడి దయతో మేమిద్దరం క్షేమంగా ఉన్నాము అని అన్నారు. నివేదికల ప్రకారం, సార్డినియా సూపర్‌కార్ టూర్‌లో భాగంగా టెయులాడా నుండి ఓల్బియా వరకు లగ్జరీ కార్ల కవాతు సందర్భంగా ఈ సంఘటన జరిగింది.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జన్మించిన గాయత్రీ జోషి వీడియో జాకీగా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత ఫెమినా ఇండియా అందాల పోటీల్లో విజేతగా నిలవాలనే లక్ష్యంతో నటనకు స్వస్తి చెప్పింది. 2000లో ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ టైటిల్ గెలుచుకున్న తర్వాత ఆమె మిస్ ఇంటర్నేషనల్ 2000లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఆమె అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహించిన చిత్రం 'స్వేడ్స్'లో నటించింది. ఇది NRI NASA ఇంజనీర్ గురించి. ఈ చిత్రం సానుకూల సమీక్షలను అందుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com