Actor Son Arrested : డ్రగ్స్ కేసులో నటుడి కొడుకు అరెస్ట్.. వెలుగులోకి కీలక విషయాలు

డ్రగ్స్ ట్రాఫికింగ్ కేసులో తమిళనాడులో అరెస్టైన ప్రముఖ నటుడు మన్సూర్ అలీఖాన్ కుమారుడు అలీ ఖాన్ తుగ్లక్ వ్యవహారంలో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. అతడు డ్రగ్స్ వాడుతున్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. చెన్నైలోని పలు కాలేజీల విద్యార్థులకు డ్రగ్స్ విక్రయించే ఓ డీలర్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంబత్తూరు కోర్టు అలీ ఖాన్ సహా ఏడుగురికి 15 రోజుల రిమాండ్ విధించింది.
డిసెంబర్ 3న డ్రగ్ సిండికేట్‌లో కీలక సభ్యుడు జిదాన్ జుబీన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో నటుడు మన్సూర్ ఆలీకి ఖాన్ తనయుడు అలీ ఖాన్ తుగ్లక్ తోపాటు మరో 9మంది వ్యక్తులకి డ్రగ్స్ సప్లయ్ వ్యవహారంతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. దీంతో పోలీసులు అలీ ఖాన్ తుగ్లక్‌తో సహా పది మందిని అరెస్ట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com