Raima Islam Shimu: సంచిలో నటి మృతదేహం.. హత్య వెనుక స్టార్ నటుడి హస్తం..?

Raima Islam Shimu (tv5news.in)
Raima Islam Shimu: పలు సినిమాల్లో, సీరియళ్లలో తనదైన నటనతో మెప్పించిన బంగ్లాదేశీ నటి రైమా ఇస్లామ్ షీమూ.. కొన్నాళ్ల క్రితం కనిపించకుండా పోయింది. పోలీసులు ఆమె కోసం ఎంత వెతికినా దొరకలేదు. చివరకు కెరానీగంజ్ ప్రాంతంలో ఒక సంచిలో తన మృతదేహం లభించింది. ఈ వార్త బంగ్లాదేశ్ సినీ పరిశ్రమ అంతటా హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
ఆదివారం రైమా కనిపించట్లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అది కేవలం మిస్సింగ్ మాత్రమే కాదని అనుమానించిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగానే నటి రైమా భర్త షకావత్ అలీ నోబెల్‌ను కస్టడీలోకి తీసుకొని విచారించగా అతడే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. కానీ కేసులో మరో ట్విస్ట్ ఉందని ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు.
నటి రైమాకు హత్యకు కారణం కుటుంబ గొడవలు మాత్రమే కాదని, మరో స్టార్ నటుడికి కూడా ఈ హత్యలో సంబంధం ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ పోలీసులు మాత్రం ఈ విషయంలో ఏ మాత్రం స్పందించట్లేదు. రైమా హత్య కేసులో భర్త నోబెల్‌తో పాటు తన స్నేహితుడు అబ్దుల్లా ఫర్హాద్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
1998లో 'భర్తమాన్' అనే చిత్రంతో నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రైమా ఇస్లామ్ షీమూ.. 25కు పైగా సినిమాల్లో నటించింది. అంతే కాకుండా పలు సీరియళ్లతో కూడా తానేంటో నిరూపించుకుంది. అలాంటి తన మరణం తన ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేస్తోంది. తన మరణానికి కారణమైన భర్తను కఠినంగా శిక్షించాలని రైమా అభిమానులు కోరుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com