Actress Ranya Rao : ట్రిప్ కు రూ.13 లక్షలు లాభం.. ఏడాదిలో 30 సార్లు దుబాయ్ కు నటి రన్యరావు

కర్ణాటక నటి రన్య రావు స్మగ్లింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నా యి. ఆమె ఏడాదిలో 30సార్లు దుబాయికి వెళ్లొస్తుందని, ప్రతీ ట్రిప్ లో రూ.12-13 లక్షలు లాభం ఉంటుందని విచారణలో తేలింది. కిలో బంగారం స్మగ్లింగ్ కు ఆమెకు లక్ష రూపాయలు వరకు ముట్టేదని తెలిసింది. అలా ఒక్కో ట్రిప్ లో ఆమె రూ.12 లక్షల నుంచి రూ.13 లక్షల వరకు ఆర్జించినట్లు పోలీసులు తేల్చారు. బంగారాన్ని స్మగ్లింగ్ చేయడానికి రన్యరావు మాడిఫైడ్ జాకెట్లతో పాటు బెల్ట్ లను ఉపయోగించేదని సమా చారం. విమానాశ్రయంలో తనిఖీల నుంచి ఆమెను ఓ కానిస్టేబుల్ తప్పించేవారని సమాచారం. ఈనెల 3న డిపార్ట్ మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఎస్ఐ) అధికారులు రన్యరావును అదుపులోకి తీసుకున్నప్పుడు మాడిఫైడ్ జాకెట్లోనే బంగారాన్ని గుర్తించారు. తాను ఐపీఎస్ కుమార్తెనని తనిఖీ అధికారులకు చెప్పినట్లు సమాచారం. గడిచిన పదిహేను రోజుల్లోనే 4 సార్లు వెళ్లడం వల్ల అనుమానం వచ్చింది. దుబాయ్ వెళ్లిన ప్రతిసారి ఒకే రకమైన దుస్తులు ధరించడంతో అప్రమత్తమైన డీఆర్ఎ అధికారులు ఆమె రాకపోకలపై నిఘాపెట్టి వ్యవహారాన్ని ఛేదించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com