Online Trading Scam : ఆన్ లైన్ ట్రేడింగ్ స్కామ్ లో నటి సుమిబోరా అరెస్ట్

గౌహతి: అస్సాంలో కలకలం రేపిన ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ స్కామ్‌లో నటి సుమిబోరాను స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఆమె భర్త తార్కిక్ బోరాను సైతం అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో వీరిపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ అయిన సంగతి తెలిసిందే. అస్సాం పోలీసులు ఇటీవల రూ.2 వేల కోట్ల స్కామ్ ను గుట్టు రట్టు చేశారు. పెట్టుబడిని రెట్టింపు చేస్తామంటూ స్టాక్‌మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ల పేరిట ప్రజల నుంచి మోసగాళ్లు సొమ్మును సమీకరించారు. ఈ కేసులో ఇప్పటికే విశాల్ ఫుకాన్‌ను అరెస్టు చేశారు. 60 రోజుల్లో పెట్టుబడులపై 30 శాతం రాబడి వస్తుందని విశాల్ నమ్మబలికాడు. నాలుగు నకిలీ సంస్థలను స్థాపించి, అస్సాం చిత్ర పరిశ్రమలో పెట్టుబడులు పెట్టాడు. పలు ఆస్తుల్ని కూడబెట్టాడు. ఈ కుంభకోణంలో బోరా దంపతులతో పాటు మరికొందరిపైనా ఆరోపణలు వచ్చాయి. అతడి అరెస్టు తర్వాతే వీరిని పోలీసులు విచారణకు పిలిచారు. అయితే వీరు హాజరుకాకపోవడంతో లుకౌట్ నోటీసులు జారీ చేసి అదుపులోకి తీసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com