American Drugs Seized : హైదరాబాద్ లో అమెరికా డ్రగ్స్ సీజ్

American Drugs Seized : హైదరాబాద్ లో అమెరికా డ్రగ్స్ సీజ్
X

హైదరాబాద్ నగరంలో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుకున్నారు. ఈక్రమంలో ఓజీ కుష్ అనే డ్రగ్స్ తోపాటు ఇతర డ్రగ్స్ ను, విదేశీ మద్యం బాటిళ్లను స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నట్లు ఎక్సెజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషి తెలిపారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ భవన్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎక్సెజ్ ఎన్ ఫోర్స్ మెంట్ జాయింట్ కమిషనర్ వివరాలు వెల్లడించారు. అమెరికాలో వినియోగించే గంజాయితో పాటు హషిష్ సింధాటిక్ డ్రగ్స్, చరస్ విలువ రూ. 40 లక్షలు ఉంటుందని తెలిపారు. కాచిగూడ రైల్వేస్టేషన్ సమీపంలో డ్రగ్స్ చేతులు మారుతున్నట్లు సమాచారం అందిందన్నారు. ఈక్రమంలో ఒక బైక్ పై వ్యక్తి, స్కోడా కారులో ఉన్న మరో వ్యక్తి ఓజీ కుషన్ ను మార్పిడి చేసుకునే రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నామన్నారు. కారులో తనిఖీలు నిర్వహించగా 500 గ్రాముల ఓజీ కుష్, ఒక కేజీ గంజాయి, 6 గ్రాముల చరస్, 4.38 గ్రాముల హషీష్ సింథాటిక్ డ్రగ్స్ తోపాటు ఐదు వీదేశీ మద్యం బాటిళ్ల లభ్యమైయ్యాయని తెలిపారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను ప్రతిష్ బట్, జై సూర్యలుగా గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు. కాగా నిందితులలో ఒకరు యూపీ రాష్ట్రానికి చెందిన మాజీ సీఎస్ కుమారుడుగా గుర్తించామన్నారు.

Tags

Next Story