Yemen: ఉపాధి కోసం అరబ్ వెళ్లింది.. కానీ అలా చేయడంతో చివరికి ఉరిశిక్షకు గురయ్యింది..

Yemen: ఉపాధి కోసం, మంచి జీతం కోసం చాలామంది భారతీయులు ఫారిన్‌కు వెళ్లడం సహజమే. ఈ మధ్య ఇలాంటివారి సంఖ్య మరింత పెరిగిపోయింది. అయితే అలా ఉపాధి కోసం అరబ్‌కు వెళ్లింది ఓ మహిళ. కానీ తనకు ఓ ఊహించని సమస్య వచ్చింది. దానివల్ల అక్కడి కోర్టు తనకు ఉరిశిక్షను ఖరారు చేసింది. ఇదంతా ఓ సినిమా కథను తలపించేలా ఉంది.
కేరళకు చెందిన నిమిషా ప్రియా అనే మహిళ నర్సు వృత్తిలో ఉంది. అయితే కొన్నాళ్ల క్రితం తను ఉపాధి కోసం అరబ్ దేశమైన యెమెన్‌కు వెళ్లింది. అక్కడ ఓ వ్యక్తి దగ్గర నర్సుగా పనిచేసింది. 2017లో ఆ వ్యక్తి మరణించాడు. ఆ వ్యక్తి రోజువారీగా తీసుకునే ఇంజెక్షన్లు, మాత్రలు ఓవర్‌డోస్ అవ్వడంతోనే మరణించాడని నిర్ధారణ అయ్యింది. దీంతో నిమిషా ప్రియా చుట్టూ ఉచ్చు బిగుసుకుంది.
నిమిషా ప్రియా వల్లే ఆ వ్యక్తి చనిపోయాడంటూ కుటుంబ సభ్యులు ఆరోపించడం మొదలుపెట్టారు. తమ తండ్రి దగ్గర నిమిషా ప్రియా పాస్‌పోర్ట్ ఉందని అందుకోసమే ఆయనను చంపేసిందని ఆ వ్యక్తి వారసులు తెలిపారు. అంతే కాకుండా తమ తండ్రితో తనకు పెళ్లి అయిపోయినట్టు ఫోర్జరీ డాక్యుమెంట్లను కూడా సృష్టించింది అని అన్నారు. అయితే పోలీసుల విచారణలో కూడా ఆధారాలన్నీ నిమిషా ప్రియాకు వ్యతిరేకంగా ఉన్నాయి.
ఆ వ్యక్తిని చంపిన కేసులో యెమెన్ కోర్టు నిమిషా ప్రియా నిందితురాలంటూ ఉరిశిక్ష విధించింది. ఇటీవల ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు నిమిషా ప్రియాకు క్షమాభిక్ష పెట్టడానికి ఒప్పుకున్నారు. కానీ బదులుగా కొంత మొత్తాన్ని ఇవ్వమని అడిగారు. నిమిషా ప్రియా కుటుంబానికి అంత స్థోమత లేకపోవడంతో ఈ కేసు ఢిల్లీ హైకోర్టుకు చేరింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com