Andhra Pradesh : ట్యాంకర్ లో దిగి ఏడుగురు కార్మికులు మృతి

Andhra Pradesh : ట్యాంకర్ లో దిగి ఏడుగురు కార్మికులు మృతి
X
ట్యాంకర్ లోపల ఊపిరి ఆడక ఏడుగురు కార్మికులు చనిపోయారు

ఆయిల్ ట్యాంకర్ లో దిగి ఏడుగురు కార్మికులు మృతిచెందారు. ఈ ఘటన కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది. పెద్దాపురం మండలం జి.రాగంపేటలో అంబటి సుబ్బన్న ఆయిల్ ఫ్యాక్టరీలో ఈ ఘటన జరిగింది. ఏడుగురు కార్మికులు ఫ్యాక్టరీలోని ఆయిల్ ట్యాంకర్ ను శుభ్రం చేసేందుకు లోపలికి దిగారు. లోపలికి వెళ్లిన కార్మికులకు ఊపిరి ఆడక ఏడుగురు చనిపోయారు. మృతుల్లో ఐదుగురు పాడేరు వాసులు, ఇద్దరు పెద్దాపురానికి చెందిన వాళ్లు ఉన్నారు.

మృతుల్లో పాడేరుకు చెందిన... కుర్రా రామారావు (45), వెచ్చంగి కృష్ణ (35), వెచ్చంగి నరసింహ, వెచ్చంగి సాగర్, కురతాడు బంజిబాబుగా ఉన్నట్లు తెలిపారు. . పులిమేరుకు చెందిన వారిలో కట్టమూరి జగదీశ్, ప్రసాద్ ఉన్నట్లు చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story