TG : శేఖర్ బాషాపై మరో కేసు నమోదు

TG : శేఖర్ బాషాపై మరో కేసు నమోదు
X

జానీ మాస్టర్‌పై కేసు పెట్టిన మహిళా కొరియోగ్రాఫర్ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ బాషాపై నార్సింగి పోలీసులకు తాజాగా ఫిర్యాదు చేశారు. BNS 79, 67, IT చట్టం 72 కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. బాషా తన ఫోన్ కాల్ రికార్డ్ చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తన పరువుకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారన్నారు. రాజ్ తరుణ్-లావణ్య వివాదంలో శేఖర్ బాషాపై ఇప్పటికే కేసు నమోదైంది.

మరోవైపు మస్తాన్ సాయి కేసు లో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఇందులో భాగంగా మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో వీడియోస్ ని గుర్తించారు. అమ్మాయిలను ట్రాప్ చేసి డ్రగ్స్ అలవాటు చేసిన మస్తాన్ సాయి మత్తులో ఉన్న వారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడని గుర్తించారు. దీంతో మస్తాన్ సాయి, ఖాజా లను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. ఈ మేరకు ఉప్పరపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్లను దాఖలు చేశారు.

మరికాసేపట్లో ఈ పిటిషన్లు విచారణకు రానున్నాయి. వారం రోజులపాటు మస్తాన్ సాయి, ఖాజా లను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. అంతకు ముందు డ్రగ్స్ టెస్ట్ లోను మస్తాన్ సాయికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో మస్తాన్ సాయి మొబైల్ సీజ్ చేసిన పోలీసులు, డ్రగ్స్ ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారన్న విషయంపై ఆరా తీయడం ప్రారంభించారు.

Tags

Next Story