CRIME: పామును కొని.. భర్తను చంపి..

యూపీ మీరఠ్ లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను.. భార్య అతడి ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసింది. మీరఠ్ కు చెందిన రవితకు అమిత్ తో వివాహమైంది. అయితే ప్రియుడు అమర్ జీత్ తో అక్రమ సంబంధం పెటుకున్న రవిత.. అతడితో కలిసి భర్తను కిరాతకంగా హత్య చేసింది. అయితే పాము కరవడం వల్లే తన భర్త చనిపోయాడని నమ్మించేందుకు ప్రయత్నించింది. ప్రియుడితో కలిసి రూ. వెయ్యి రూపాయలు పెట్టి పామును కొని.. భర్త పడుకున్న మంచంలో పడేసింది. పాము రాత్రంతా అమిత్ ను కాటేస్తూనే ఉంది. అమిత్ తల్లిదండ్రులు, బంధువులు కూడా పాము కాటు వల్లే మరణించాడని నమ్మారు. అయితే పోస్టుమార్టం రిపోర్టులో అసలు విషయం బయటపడింది. అమిత్ ఊపిరాడక మరణించాడని... పాము కాటు వల్ల కాదని పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. లేబర్ పని చేసుకునే అమిత్ తన ఇంట్లోని మంచంపై చనిపోయి కనిపించాడు, అతని శరీరం కింద ఒక పెద్ద పామును బంధువులు గుర్తించారు. అతని శరీరంపై పాము కాటు గుర్తులను చూసిన బంధువులు... హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
రూ. 1000తో పామును కొని...
అయితే అప్పటికే అమిత్ చనిపోయాడని వైద్యుడు నిర్థారించారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించగా సంచలన విషయాలు బహిర్గతమయ్యాయి. పోలీసు దర్యాప్తులో అమిత్ భార్య రవిత, అమిత్ ప్రియుడు అమర్‌దీప్.. అమిత్ ను హత్య చేసినట్లు అంగీకరించారు. అమిత్‌ను గొంతు పిసికి చంపి.. అనంతరం రూ. 1000 కొన్న పామును అతని మంచంపై వేసింది. ఇటీవలే నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ దారుణం హత్య మీరట్‌ను కుదిపేయగా... తాజాగా మరో దారుణం జరిగింది. దీనిపై స్థానికులు భగ్గమంటున్నారు. ఇంత పక్కాగా ప్లాన్ చేసి హత్యచేసిన వారికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com