TG : పెద్దాపూర్ గురుకుల స్కూల్లో మరో విద్యార్థి మృతి

TG : పెద్దాపూర్ గురుకుల స్కూల్లో మరో విద్యార్థి మృతి
X

మెట్‌పల్లి మండలం పెద్దపూర్ గురుకుల స్కూల్లో విద్యార్థుల వరస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 10రోజుల వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థులు మృతిచెందగా పలువురు అస్వస్థతకు గురయ్యారు. దీంతో మిగితా విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గరవుతున్నారు. శుక్రవారం ఉదయం పాఠశాలలో అనిరుద్, మోక్షిత్ అనే ఇద్దరు కడుపునొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్ సిబ్బంది వారిని హుటాహుటిన కోరుట్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని జగిత్యాల జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్సపొందుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అనిరుద్ మృతిచెందాడు. మరో విద్యార్థి మోక్షిత్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆస్పత్రికి చేరుకున్న అధికారులు పరిస్థితిపై ఆరా తీశారు. గత నెల 27న కూడా ఓ విద్యార్థి మరణించిన విషయం తెలిసిందే.

Tags

Next Story