AP : TDP ఆఫీస్ ధ్వంసం చేసిన వారిపై టీడీపీ నేతల ఫిర్యాదు

X
By - Vijayanand |23 Feb 2023 12:51 PM IST
చంద్రబాబు పాలనలో ఎప్పుడూ రౌడీయిజం, గూండాయిజాన్ని ప్రోత్సహించలేదని అన్నారు
గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన వారిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. జగన్ సర్కార్‌పై కొనకళ్ల తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ గెలుపు అనేది ఎల్లకాలం ఉండదని అన్నారు. చంద్రబాబు పాలనలో ఎప్పుడూ రౌడీయిజం, గూండాయిజాన్ని ప్రోత్సహించలేదని అన్నారు. హైదరాబాద్‌లో మత కలహాలు, రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని అంతంచేసిన వ్యక్తి చంద్రబాబు అని తెలిపారు. వైసీపీ హయాంలో పోలీసు శాఖ అంటే గౌరవం లేకుండా పోయిందని అన్నారు. టీడీపీ ఆఫీసు ధ్వంసం చేసి.. టీడీపీ నేతలపైనే కేసులు పెట్టడం విడ్డూరమన్నారు కొనకళ్ల.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com