Crime : డ్రైవర్ల వేగానికి హద్దులే లేవా.. ఏంటీ దారుణాలు

Crime : డ్రైవర్ల వేగానికి హద్దులే లేవా.. ఏంటీ దారుణాలు
X

చేవెళ్ల బస్సు ప్రమాదం నిజంగా అత్యంత బాధాకరం. ఇలాంటి దారుణాలు అస్సలు జరగొద్దని అంతా కోరుకోవాలి. అయితే ఇక్కడే డ్రైవర్ల నిర్లక్ష్యాలు, వేగంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆర్టీసీ బస్సు డ్రైవర్ గురించి ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు. ఒక డ్రైవర్ ఎర్లీ మార్నింగ్ 4.30 గంటలకు బస్ ఎక్కాడు అంటే.. అతను ఎప్పుడో 3 గంటలకు లేచి ఉండాలి. ఈ లెక్కన రాత్రి బస్ డ్రైవర్ పడుకున్నాడా లేదంటే మద్యం ఏమైనా తాగాడా అనేది ఎవరైనా పట్టించుకుంటారా అంటే అస్సలు లేదు. అసలు ఆర్టీసీలో డ్రైవర్ల నిర్లక్ష్యంపై ఎలాంటి ముందు జాగ్రత్తలు, చెకింగ్ లు లేవు. డ్రైవర్ ఎలా వచ్చినా పట్టించుకునే వారే లేరు. ఒక డ్రైవర్ చేతిలోనే పదుల కొద్దీ ప్రయాణికుల ప్రాణాలు ఉంటాయి.

ఏ మాత్రం పొరపాటు జరిగినా ఈ రోజు జరిగింది చూశాం కదా. ఇక్కడ టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం చాలా కీలకం. టిప్పర్ లో ఓవర్ లోడ్ గా కంకర పోయడం ఇంకో తప్పిదం. ఏ టిప్పర్ లో అయినా సరే 11 టన్నులకు మించి కంకర ఉండొద్దు. కానీ చేవెళ్ల ప్రమాదంలో ఉన్న టిప్పర్ లో స్థాయికి మించి కంకర ఉంది. అదే ఎక్కువ మంది ప్రాణాలను బలి తీసుకుంది. అర్ధరాత్రి కదా ఆపెవారు ఎవరూ ఉండరని ఇష్టారీతిన కంకర వేసుకుని వచ్చారు. కానీ అమాయకుల ప్రాణాలు తీశారు. మరి ఈ ఓవర్ లోడ్ మీద ఎందుకు ముందు నుంచే చర్యలు తీసుకోవట్లేదు. పైగా టిప్పర్ ఓవర్ స్పీడ్ లో ఉంది. ఓవర్ స్పీడ్ పై ఏమైనా స్ట్రిక్ట్ యాక్షన్స్ ఉన్నాయా అంటే అదీ లేదు.

పైగా ప్రమాదం జరిగిన హైవేను డెవలప్ చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్లు ఉన్నాయి. కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. హైవేకు ఆనుకుని ఉన్న మర్రి చెట్లు పోతాయని కొందరు కేసులు వేసి అడ్డుకున్నారు. అది మరీ దారుణం. హైవేను వెడల్పు చేయకపోవడం వల్ల ఇంత మంది ప్రాణాలు పోయాయి. రోడ్డు డెవలప్ మెంట్ లేకపోవడం, డ్రైవర్ నిర్లక్ష్యం, టిప్పర్ ఓవర్ స్పీడ్.. వెరసి అమాయలకు ప్రాణాలను గాల్లో కలిపేశాయి. ఈ పొరపాట్లు ముందు ముందు జరగకుండా చూస్తారా లేదా అనేది తెలియాలి.


Tags

Next Story