Robotic Surgery : క్యాన్సర్ పేషెంట్ ప్రాణం తీసిన రోబో.. శరీరం నిండా రంధ్రాలు!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో (Artificial Intelligence) లాభంతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. అందుకు ఉదాహరణే ఈ ఆపరేషన్ అని మెడికల్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. శస్త్రచికిత్స చేస్తున్న రోబోట్ (Robot) ద్వారా సంభవించిన విపత్తు రోగి ప్రాణాలను తీసిందని న్యూయార్క్ పోస్ట్ ఒక నివేదికలో తెలిపింది.
యునైటెడ్ స్టేట్స్ లోని (US) పేషెంట్ పేరు సాండ్రా సుల్ట్జర్. ఆమె భర్త హార్వే సుల్ట్జర్, ఫిబ్రవరి 6, 2024న ఇంట్యూటివ్ సర్జికల్‌పై ఫిర్యాదు చేశారు. శస్త్రచికిత్స రోబోట్ చేసిన శస్త్రచికిత్స ఫలితంగా అతని భార్య ఆరోగ్య సమస్యలను ఎదుర్కొందని తెలిపాడు. తన భార్య పెద్దప్రేగు క్యాన్సర్‌కు చికిత్స చేయించడానికి డాక్టర్లను ఆయన సంప్రదించాడు. సెప్టెంబర్ 2021లో బాప్టిస్ట్ హెల్త్ బోకా రాటన్ రీజినల్ హాస్పిటల్‌లో ఆమె పెద్దప్రేగు క్యాన్సర్‌కు రిమోట్ కంట్రోల్డ్ డావిన్సీ రోబోట్ తో ఆపరేషన్ చేశారు.
ఆపరేషన్ చేస్తున్న టైంలో రోబోట్ ఆమె అవయవాలకు రంధ్రం చేసిందని, ఇది ఆమె మరణానికి దారితీసిందని తెలిపాడు. దీనిపై ఆ మెడికల్ కంపెనీపై 75వేల డాలర్లకు దావా వేశారు. రోబోట్ ఆమె చిన్న ప్రేగులో రంధ్రం చేసిందని, అదనపు వైద్యపరమైన జోక్యం అవసరమని తెలిపారు. రోబోట్ అంతర్గత అవయవాలకు కారణమయ్యే ఇన్సులేషన్ సమస్యలను కలిగి ఉందని కంపెనీకి తెలుసునని, అయితే, అది కుటుంబ సభ్యులకు తెలియజేయలేదని దావా తెలుపుతోంది. రోబోట్‌తో అయ్యే గాయాలు, లోపాల గురించి కంపెనీకి వేలాది నివేదికలు అందినా.. వారు పలు అంశాలను దాచిపెట్టారని దావాలో బాధితులు తెలిపారు. రోబోటిక్ సర్జరీలో అనుభవం లేని ఆసుపత్రులకు తన రోబోట్‌లను అమ్మారని కూడా తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com