Crime : ఎన్టీఆర్ జిల్లాలో దారుణం... ప్రేమించిందని కూతుర్ని చంపేసాడు

ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో మైనర్ బాలికను హత్య చేశాడో కసాయి తండ్రి. ఐదు రోజుల క్రితం బాలిక మిస్సింగ్ పై బందువుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అసలు నిజాలు బయటపెట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రెండు వివాహాలు చేసుకుని మైలవరం శుద్దిపేట ప్రాంతంలో నివాసముంటున్నాడు చిందే బాజీ(46). మొదటి భార్య ద్వారా 5గురు ఆడపిల్లలు, రెండవ భార్య ద్వారా ఒక ఆడపిల్ల జన్మించింది. రెండవ భార్యతో వివాహం తర్వాత బాజీ వద్ద నుండి విడిగా ఉంటుంది మొదటి భార్య. ఇక రెండవ భార్యతో కలిసి గంజాయి విక్రయాలు చేపట్టి ఆ కేసులో జైలుకెళ్ళారు బాజీ, అతని రెండవ భార్య . అయితే తన భార్యఇంకా జైల్లోనే ఉండగా ఇటీవలే విడుదలైయ్యాడు బాజీ. ఇటీవల తన కుమార్తె ఒక యువకుడితో ప్రేమలో పడిందని గమనించి హెచ్చరించిన బాజీ వినకపోవడంతో ఇంట్లోనే తన ఐదుగురు కుమార్తెల సమక్షంలోనే గాయత్రి పై ఐరన్ రాడ్ తో దాడికి పాల్పడ్డాడు. రెండవ భార్య కుమార్తె మరణించడంతో నెత్తుటి మరకలు పోవడానికి గదిని బ్లీచింగ్ తో శుభ్రం చేసారు కుమార్తెలు.మృతి చెందిన బాలిక ఆచూకీ కోసం, బాజీ ఆచూకి కోసం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com