Crime : కోకాపేటలో దారుణం: భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య

కట్టుకున్న భర్తను కూరగాయలు కోసే కత్తితో దారుణంగా పొడిచి చంపింది ఓ ఇల్లాలు. భార్య, భర్తల మధ్య గొడవలతో క్షణికావేశంలో భర్తను కడతేర్చింది. హైదరాబాద్ కోకాపేటలో ఈ దారుణం జరిగింది. మృతుడు అస్సాం రాష్ట్రానికి చెందిన కృష్ణ జ్యోతి బోరాగా గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం... అస్సాం కు చెందిన కేసు కృష్ణ జ్యోతి బోరా, భరత్ బోరా దంపతులు పొట్ట కూటి కోసం కోకపేటకు వచ్చారు. ఇక్కడ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా భర్త కృష్ణ జ్యోతి బోరా తన భార్యను వేధిస్తున్నాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువయ్యాయి. గత అర్ధరాత్రి కూడా ఇద్దరి మధ్య గొడవ జరగడంతో..ఆగ్రహానికి గురైన భార్య భరత్ బోరా, తన భర్త పై కూరగాయలు కోసే కత్తితో విచక్షణారహితంగా దాడి చేసింది. బాధితుడు కేకలు వేయడంతో స్థానికులు వెంటనే వచ్చి చూడగా, కృష్ణ జ్యోతి బోరా రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. భర్తను హత్య చేసిన భరత్ బోరాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com